Telangana : రాష్ట్రంలో తీవ్ర చలి, ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
తెలంగాణ రాష్ట్రంలో చలితో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. మంగళవారం రాత్రి నుంచి చలి తీవ్రత ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలైంది, ఉదయం 10 గంటల వరకు ఉష్ణోగ్రతలు తగ్గలేదు, దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. హైదరాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 6.2 డిగ్రీలకు పడిపోయింది, పటాన్‌చెరులో 7 డిగ్రీలు, మెదక్‌లో 7.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కాగా హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 11.9 డిగ్రీలు నమోదయ్యాయి. శీతలగాలులు, చలి తీవ్రత పెరగడంతో వాతావరణ శాఖ ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ ప్రకారం, రానున్న రెండు రోజులలో చలి పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని సూచనలిచ్చింది.