Page Loader
Fake SBI branch: ఈ మోసగాళ్ల తీరే వేరయా..  ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే తెరిచారు.. 
ఈ మోసగాళ్ల తీరే వేరయా.. ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే తెరిచారు..

Fake SBI branch: ఈ మోసగాళ్ల తీరే వేరయా..  ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే తెరిచారు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 03, 2024
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో నేరస్తులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)నకిలీ బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ బ్రాంచ్‌ ద్వారా వారు భారీ మోసాలకు పాల్పడ్డారు.ప్రధానంగా నిరుద్యోగుల నుంచి బ్యాంక్ ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి,నకిలీ శిక్షణ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకున్న ఘటన సెప్టెంబర్ 18 నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని మల్కరౌడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చాపోరా గ్రామంలో ఈ నకిలీ SBI బ్రాంచ్ ప్రారంభమైంది. అద్దె భవనంలో ఈమోసపూరిత శాఖ నడిపి,నిజమైన SBI బ్రాంచ్‌లా లొగోతో పోస్టర్లు,బ్యానర్లు ఏర్పాటు చేశారు. లోపలికి వెళితే సాధారణ బ్యాంక్‌లా కనిపించినా,వారి ప్రధాన ఉద్దేశం నిరుద్యోగుల నుంచి మోసం చేయడం. బ్యాంక్ ఉద్యోగాల పేరుతో భారీ మొత్తాలను వసూలు చేసి,అదే బ్రాంచ్‌లో ట్రైనింగ్ కూడా ఇచ్చారు.

వివరాలు 

ఐదుగురు ఉద్యోగులను ఇంటర్వ్యూల ద్వారా రిక్రూట్

ఈ బ్యాంక్ తీరుపై స్థానికులకు అనుమానం రావడంతో, వారు వేరే SBI బ్రాంచ్‌కి ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్బా ప్రాంతీయ కార్యాలయం నుంచి వచ్చిన SBI బృందం బ్రాంచ్‌ను తనిఖీ చేసి, అది నకిలీదని నిర్ధారించింది. పోలీసులు బ్రాంచ్‌పై దాడి చేసి, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు ఉద్యోగులను ఇంటర్వ్యూల ద్వారా రిక్రూట్ చేసినట్లు గుర్తించారు. వారి విచారణ కొనసాగుతోందని ఏఎస్పీ రమా పటేల్ తెలిపారు. కేసు నమోదు బ్రాంచ్ మేనేజర్‌గా నటించిన సూత్రధారి సహా ముగ్గురు ఆపరేటర్లపై భారతీయ న్యాయసంహిత కింద కేసు నమోదు చేశారు. ఈ బ్రాంచ్ ద్వారా ఎంత మందిని మోసం చేశారో, ఎంత డబ్బు వసూలు చేసారో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వివరాలు 

ఇంతకుముందు తమిళనాడులో జరిగిన ఘటనా 

2020లో తమిళనాడులో కడలూరు జిల్లాలో నకిలీ SBI బ్రాంచ్‌ను నడుపుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. SBI మాజీ ఉద్యోగి కుమారుడైన కమల్ బాబు ఈ మోసపూరిత శాఖను కంప్యూటర్లు, లాకర్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఏర్పాటు చేశాడు.