NTR: ఎన్టీఆర్ 101వ జయంతి.. నివాళులర్పించిన కుటుంబ సభ్యులు,టీడీపీ నేతలు
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు.
నివాళులర్పించిన వారిలో ఎన్టీఆర్ కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్,టీడీపీ సీనియర్ నేత బక్కని నర్సింహులు ఉన్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ తెలుగువారికి ఆరాధ్య దైవమన్న అయన.. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి చదువుకి ప్రాధాన్యత ఇచ్చి..ఆ తర్వాత చిత్రరంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందారన్నారు.
Details
ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్
అనంతరం,ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల దిశను మార్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు.
గతంలో అధికారానికి దూరమైన వారికి ఎన్టీఆర్ అవకాశాలు కల్పించారని, ఆయన ప్రభుత్వంలో ఉన్న సమయంలో సాహసోపేతమైన సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని బాలకృష్ణ ప్రశంసించారు.
ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలను నేటికీ రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు.