ప్రశాంతంగా ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. ఈసారి ఎంతమంది మంచులింగాన్ని దర్శించుకున్నారో తెలుసా
ప్రసిద్ధ అమర్‌నాథ్ యాత్ర గురువారం ముగిసింది.దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లోని మంచు శివలింగం యాత్ర జులై 1న మొదలై ఆగస్ట్ 31న ముగిసింది. ఈ మేరకు 62 రోజులు పాటు యాత్ర కొనసాగింది. 2016 నుంచి ఈసారే అధిక సంఖ్యలో శివలింగాన్ని దర్శించారు. ఈసారి దాదాపు 4.4 లక్షల భక్తులు అమర్ నాథుడ్ని దర్శించారు.గతేడాది 3.65 లక్షల మంది యాత్ర చేపట్టారు. అనంతనాగ్ జిల్లాలోని 48 కి.మీ నునవాన్-పహల్గామ్ మార్గం, గందేర్బల్ లోని 14 కి.మీ బల్తల్ మార్గంలో కట్టుదిట్టమైన భద్రతతో యాత్ర ప్రశాంతంగా సాగింది. మహంత్ దీపేంద్ర గిరి ఆధ్వర్యంలో సాధువులు, యాత్రికులు పెహల్గామ్ నుంచి 42 కి.మీ దూరం నడిచి గురువారం చివరి రోజు ఉదయం ప్రత్యేక పూజలు చేశారు.