Farmers Protest: నేడు ఢిల్లీలో రైతుల నిరసన.. అప్రమత్తమైన ప్రభుత్వం
రైతులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం మరోసారి ఉద్యమాన్ని ప్రారంభించారు. నోయిడాలోని మహామాయ ఫ్లైఓవర్ నుంచి నేడు (సోమవారం) రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ సరిహద్దులో పోలీసు భద్రతను పెంచారు. భారతీయ కిసాన్ పరిషత్ నేత సుఖ్బీర్ ఖలీఫా కొత్త వ్యవసాయ చట్టాల మేరకు నష్టపరిహారం, ఇతర ప్రయోజనాల కోసం రైతులు ఈ పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు.
రైతుల డిమాండ్లు
పాత భూసేకరణ చట్టం ప్రకారం బాధిత రైతులకు 10 శాతం ప్లాట్లు మరియు 64.7 శాతం పెంచిన నష్టపరిహారం ఇవ్వాలి. జనవరి 1, 2014 తర్వాత సేకరించిన భూములకు మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు నష్టపరిహారం, 20 శాతం ప్లాట్లు ఇవ్వాలి. భూమిలేని రైతుల పిల్లలకు ఉపాధి,పునరావాసం అందించాలి. హైపవర్ కమిటీ ఆమోదించిన అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. తనిఖీలు,ట్రాఫిక్ మళ్లింపులు: రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ పోలీసులు సరిహద్దుల్లో తగినంత తనిఖీలను నిర్వహిస్తున్నారు. గౌతమ్ బుద్ధ నగర్ నుండి ఢిల్లీ సరిహద్దు వరకు అనేక మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.