Page Loader
బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు
బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు

బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు

వ్రాసిన వారు Stalin
May 08, 2023
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు రైతులు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సభ్యులు దిల్లీ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి మరీ, రెజ్లర్ల నిరసన వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో జంతర్ మంతర్ వద్ద కాసేపు హైడ్రామా జరిగింది.

రెజ్లర్లు

న్యాయం జరిగే వరకు పోరటం ఆగదు: రెజ్లర్లు

జంతర్ మంతర్ వద్దకు వచ్చిన రైతులు హడావిడి చేశారని, బారికేడ్లను తొలగించాలని దిల్లీ పోలీసులు ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేసుకోవాలని పోలీసులు సూచించారు. అలాగే చట్టాన్ని పాటించాలని ప్రజలను కోరారు. తమకు న్యాయం జరిగే వరకు పోరటం ఆగదని, బ్రిజ్ భూషణ్‌ను డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌గా తొలగించి కటకటాల వెనక్కి నెట్టే వరకు ఇక్కడి నుంచి కదలబోమని నిరసనకు దిగిన రెజ్లర్లు స్పష్టం చేశారు. మే 21లోగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత వినేష్ ఫోగట్ పేర్కొన్నారు. బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలన్నదే తమ డిమాండ్‌ అని వినేష్‌ మరోసారి స్పష్టం చేశారు.