FIITJEE Coaching Center: టీచర్ల జీతాలు చెల్లించకపోవడంతో యూపీ, ఢిల్లీలో ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూసివేత
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్,దిల్లీ ప్రాంతాల ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేశారు.వారం రోజుల నుంచి ఈ సెంటర్లు పని చేయడం లేదు.
దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బోర్డు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలను మూసివేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జీతాలు చెల్లించకపోవడం వల్లే అనేక మంది టీచర్లు సంస్థను వదిలిపోతున్నట్లు తేలింది.
నోయిడా, ఘజియాబాద్, భోపాల్, వారణాసి, ఢిల్లీ, పాట్నా నగరాల్లోని ఫిట్జ్ కోచింగ్ సెంటర్లను మూసివేశారు.
యూపీ లోని మీరట్ సెంటరును కూడా తాజాగా మూసివేశారు.నోయిడా నుంచి టీచర్లను రప్పించే ప్రయత్నం చేసినా, కొన్ని రోజుల తరువాత మాత్రమే ఇన్‌స్టిట్యూట్ పనిచేసింది.
వివరాలు
ఫిట్జ్ సంస్థలో ఆర్థిక సంక్షోభం
విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసు ఫిర్యాదులు నమోదు చేశారు. కోచింగ్ సంస్థ ఎటువంటి నోటీసు లేకుండా లేదా రిఫండ్ ఇవ్వకుండా కోచింగ్ కేంద్రాలను మూసివేసినట్లు పేరెంట్స్ తెలిపారు.
మూసివేసిన బ్రాంచీల దగ్గర పేరెంట్స్ నిరసన చేపట్టారు.చాలా నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, అందుకే ఫ్యాకల్టీ సభ్యులు సంస్థను వీడి వెళ్లిపోతున్నారని ఓ ఫిట్జ్ టీచర్ చెప్పారు.
ఫిట్జ్ సంస్థలో ఆర్థిక సంక్షోభం ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
ఈ సంస్థకు సంబంధించిన బ్రాంచీలపై ప్రభుత్వచర్యలు కూడా తీసుకున్నాయి. లైసెన్సులు లేవని, ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించడంలేదని ఆరోపణలు వచ్చాయి.
వివరాలు
72 ఫిట్జ్ కేంద్రాలలో సుమారు 300 మంది ఉద్యోగులు
ఫిట్జ్ సంస్థను 1992లో డీకే గోయల్ స్థాపించారు. ఆయన ఐఐటీ ఢిల్లీ నుండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందించే సంస్థగా ఇది పేరుపొందింది.
దేశవ్యాప్తంగా 41 నగరాలలో 72 ఫిట్జ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో సుమారు 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.