Page Loader
Budget 2025: లోక్‌సభ ముందు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌
లోక్‌సభ ముందు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

Budget 2025: లోక్‌సభ ముందు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సర్వే (Economic Survey 2024-25)ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత, ఆమె ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచారు. అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా సభను శనివారానికి వాయిదా వేశారు. రేపు (ఫిబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ సభకు సమర్పించనున్నారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది. గత ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతి, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేయడానికి ఈ ఎకనమిక్‌ సర్వే ఉపయోగపడుతుంది.

వివరాలు 

డ్జెట్‌కు ఒక రోజు ముందుగా..

ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్‌ అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనమిక్‌ డివిజన్‌ ఈ సర్వేను రూపొందిస్తుంది. 1950-51 నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్‌తో పాటు ప్రవేశపెట్టేవారు. అయితే, 1960 తర్వాత బడ్జెట్‌కు ఒక రోజు ముందుగా ప్రవేశపెట్టే సంప్రదాయం ప్రారంభమైంది.