LOADING...
Uttar Pradesh: పాక్‌ జాతీయతను దాచి నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం.. మహిళపై కేసు 
మహిళపై కేసు

Uttar Pradesh: పాక్‌ జాతీయతను దాచి నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం.. మహిళపై కేసు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2026
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌లో ఓ ఉపాధ్యాయురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె పాకిస్థాన్‌ జాతీయత దాచుకుని ప్రభుత్వ ఉద్యోగం పొందినట్టు తేలింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, రాంపుర్‌కు చెందిన మాహిరా అక్తర్‌ (ఇతర పేర్లు: ఫర్జానా) 1979లో ఒక పాకిస్థానీ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ దేశ పౌరసత్వం పొందింది. కొన్నేళ్ల తర్వాత విడాకులు పొందడంతో, ఆమె ఇద్దరు పిల్లలతో పాకిస్థాన్‌ వీసా ఆధారంగా భారత్‌ చేరింది. ఆ తరువాత స్థానికంగా మరో వ్యక్తిని వివాహం చేసుకుంది.

వివరాలు 

సస్పెన్షన్‌ వేటు

అదే సమయంలో తనను తాను భారతీయురాలిగా చెప్పుకొంటూ.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించింది. రాంపుర్‌ జిల్లా కుమ్హరియా గ్రామంలో విధులు నిర్వర్తించింది. అయితే, విద్యాశాఖ అధికారులు నిర్వహించిన అంతర్గత విచారణలో ఆమె పాకిస్థానీ పౌరురాలు అని బయటపడింది. నకిలీ పత్రాలు ఉపయోగించి ఉద్యోగం పొందిందని నిర్ధారించారు. తొలుత ఆమెపై సస్పెన్షన్‌ వేటు వేశారు. తరువాత పూర్తి విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు.

Advertisement