Page Loader
Hyderabad: కొండాపూర్‌లోని అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం
కొండాపూర్‌లోని అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Hyderabad: కొండాపూర్‌లోని అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 31, 2024
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ కొండాపూర్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన రాజరాజేశ్వరి అపార్ట్‌మెంట్‌లో చివరి అంతస్తులో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో అపార్ట్‌మెంట్‌ నివాసులు భయంతో తల్లడిల్లి బయటకు పరుగులు తీశారు.