
Firing at Salman khan home: కాల్పులు జరిపింది లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన వారే...ముంబై పోలీసుల వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman khan) ఇంటి బయట ఆదివారం కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు.
సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అందులో ఒక వ్యక్తిని విశాల్ గా గుర్తించామని పోలీసులు తెలిపారు.
అతడు బిష్ణోయ్ ముఠాకు చెందిన రోహిత్ గొదారాతో పరిచయాలు ఉన్నట్లు వెల్లడైందని పోలీసులు వివరించారు.
మార్చి నెలలో గురుగ్రామ్‌కు చెందిన వ్యాపారవేత్త సచిన్ ముంజాల్‌ను హత్య చేసిన కేసులో విశాల్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
ప్రస్తుతం విదేశాల్లో ఉన్న రోహిత్ గోదారా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ముంజాల్ హత్యను అంగీకరించినట్లు తెలుస్తోంది.
Lawrence Bishnoye
వీరిద్దరూ పరారీలో ఉన్నారు: ముంబై పోలీసులు
సీసీ టీవీ ఫుటేజీలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు క్యాప్ లు ధరించి సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరుపుతున్నట్లు ఉంది.
అందులో ఒకరు బ్లాక్ జాకెట్, తెల్లటి టీ-షర్టును వేసుకుని ఉండగా.. మరొకరు ఎరుపు రంగు టీ-షర్ట్ ధరించినట్లు కనిపిస్తోంది.
కాల్పులకు ముందు వీరిద్దరూ సల్మాన్ ఖాన్ ఇంటివద్ద రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వీరిద్దరూ ముంబైను వదిలి బయటకెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.