Priyanka Gandhi: ఎన్డీయేకు తొలి ఓటమి : ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
డీలిమిటేషన్ వెనుక ఉన్న బీజేపీ కుట్రను అడ్డుకున్నామని ప్రియాంక గాంధీ తెలిపారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో విపక్షాలపై బురద జల్లే ప్రయత్నం జరిగిందని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇది తొలి పెద్ద ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రజాస్వామ్యం గెలిచిందని పేర్కొన్నారు. విపక్షాలన్నీ ఒక్కటైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదని ఈ పరిణామం నిరూపించిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఇతర అంశాలతో ముడిపెట్టకూడదని, ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని వెల్లడించారు.
వివరాలు
కేంద్ర ప్రభుత్వం మహిళలను తప్పుదోవ పట్టిస్తోంది
అమిత్ షా మాటలను ప్రజలు నమ్మడం లేదని, బీజేపీ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. కేంద్రం తమ మాటలను ప్రజలు నమ్మాలని పదేపదే చెప్పినా, ప్రజలు ఇప్పుడు విషయాలను స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. దేశం మారిందని, ప్రజల్లో అవగాహన పెరిగిందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం మహిళలను తప్పుదోవ పట్టించకూడదని, వారికి తక్షణమే హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇండియా కూటమి వైఖరి స్పష్టమని, ఈ బిల్లుపై జరిగిన మూడు రోజుల చర్చ మహిళా రిజర్వేషన్ల గురించి కాదని, కేవలం నియోజకవర్గాల పునర్విభజనకు (డీలిమిటేషన్) సంబంధించినదేనని అన్నారు. ఈ అంశం ఓటింగ్ ద్వారా మరింత స్పష్టమైందని, తమ అభిప్రాయాలను విపక్షాలు నిర్ద్వంద్వంగా వెల్లడించాయని ప్రియాంక గాంధీ తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేంద్ర ప్రభుత్వానికి చీకటి రోజు
#WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra says, "Our stand is very clear. The entire INDIA alliance has made its stand very clear, and this vote has made it even clearer that, in our understanding, this bill that was introduced and the three-day discussion was not about… pic.twitter.com/6GkCRVtPXK
— ANI (@ANI) April 18, 2026