Page Loader
GBS case: హైదరాబాద్‌లో గులియన్‌ బారే సిండ్రోమ్‌ తొలి కేసు నమోదు
హైదరాబాద్‌లో గులియన్‌ బారే సిండ్రోమ్‌ తొలి కేసు నమోదు

GBS case: హైదరాబాద్‌లో గులియన్‌ బారే సిండ్రోమ్‌ తొలి కేసు నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో గులియన్‌ బారే సిండ్రోమ్‌ (జీబీఎస్‌) కేసు నమోదు అయ్యింది. సిద్దిపేట మండలానికి చెందిన ఒక మహిళకు జీబీఎస్‌ ఉందని వైద్యులు నిర్ధరించారు. బాధితురాలు ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌ మీద చికిత్స పొందుతోంది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో వంద వరకు ఈ కేసులు నమోదైనట్లు సమాచారం అందింది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది.

వివరాలు 

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థను కలిగి ఉన్న వ్యక్తులపై ప్రభావం 

ఈ వ్యాధి సాధారణంగా బ్యాక్టీరియాలు లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల బలహీనమైన రోగనిరోధక వ్యవస్థను కలిగి ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ వ్యాధిలో శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందించే రోగనిరోధక వ్యవస్థ పొరపాటున నరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తుంది, ఇది ఒక అరుదైన పరిస్థితి. ఈ రుగ్మత బారిన పడిన వ్యక్తులకు ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొట్ట నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కలుషిత ఆహారం లేదా నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రజలు భయపడవద్దని, జీబీఎస్‌ ఒక అంటువ్యాధి కాదని, సరైన చికిత్సతో నయం చేయవచ్చని వారు వెల్లడించారు.