First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం.. చికిత్స పొందుతూ మహిళ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) బారిన పడిన ఓ మహిళ మరణించడంతో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది.
జీబీఎస్ సోకి మరణించిన తొలి వ్యక్తి ఆమె కావడంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. జీబీఎస్ పాజిటివ్‌గా తేలితే ప్రాణాపాయం ఉందా? అనే సందేహంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాకు చెందిన వివాహిత గులియన్ బారే సిండ్రోమ్ అనే నరాల వ్యాధి బారిన పడి శనివారం మృతిచెందారు.
Details
గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు
జీబీఎస్ సోకినవారిలో ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపించవచ్చు.
డయేరియా, పొత్తికడుపు నొప్పి, ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం వంటి సమస్యలు కూడా ఈ వ్యాధికి లక్షణాలుగా చెప్పొచ్చు.
ఇది ముఖ్యంగా నీటి ద్వారా లేదా కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా సోకడం వల్ల ఉత్పన్నమవుతుంది.
అయితే జీబీఎస్ అంటువ్యాధి కాదని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సరైన చికిత్స ద్వారా బాధితులను పూర్తిగా నయం చేయవచ్చని ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.