LOADING...
Narendra Modi: ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై తొలిసారి రైలు ప్రయాణం.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం
ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై తొలిసారి రైలు ప్రయాణం.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం

Narendra Modi: ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై తొలిసారి రైలు ప్రయాణం.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

కశ్మీర్‌కి రైలు మార్గం కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద రైల్వే ప్రాజెక్ట్‌ చివరికి పూర్తయింది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్ట్‌ (USBRL) పూర్తవ్వడంతో జూన్ 6న ప్రధాని నరేంద్ర మోదీ వందే భారత్‌ రైలు సేవలకు శ్రీకారం చుట్టనున్నారు. జమ్ముకశ్మీర్‌లో 'ఆపరేషన్ సిందూర్‌' తర్వాత మోదీ మొదటిసారి రాష్ట్రాన్ని సందర్శించనుండడం విశేషం

Details

కాత్రా-బారాముల్లా మధ్య వందే భారత్‌ ప్రారంభం 

శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్ (కాత్రా) నుంచి బారాముల్లా వరకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అదే విధంగా బారాముల్లా నుంచి కాత్రాకు తిరుగు ప్రయాణ వందే భారత్‌ సేవలకూ ప్రారంభం జరగనుంది. ఇప్పటివరకు జమ్ము, ఉధంపూర్, కాత్రా ప్రాంతాల్లో మాత్రమే రైళ్లు నడిచాయి. కానీ ఇప్పుడు బనిహాల్-కాత్రా మధ్య 111 కిలోమీటర్ల క్లిష్టమైన మార్గం పూర్తవడంతో మొత్తం కాశ్మీర్‌ లోయ రైల్వే కనెక్షన్‌ పూర్తయింది

Details

చెనా నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను, అంజీ ఖడ్‌లో ఏర్పాటు చేసిన భారతదేశ తొలి కేబుల్‌ స్టేడ్‌ వంతెనను కూడా ప్రారంభించనున్నారు. వీటితోపాటు మోదీ ఒక బహిరంగ సభను కూడా ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. ప్రాజెక్టు వెనక ఉన్న చరిత్ర ఈ ప్రాజెక్టును మొదటగా 1995లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు 2,500 కోట్లతో మంజూరు చేశారు. ఆ తర్వాత 2002లో వాజ్‌పేయి జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టుగా ప్రకటించారు. తరచుగా వాయిదాల తర్వాత, 2024 డిసెంబరులో చివరి ట్రాక్ వర్క్ పూర్తయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

Details

ప్రాజెక్టు వివరాలు

మొత్తం వ్యయం: రూ. 43,000 కోట్లు మొత్తం మార్గం: 272 కిలోమీటర్లు బ్రిడ్జులు: 943 ప్రధాన సురంగాలు: 36 దేశంలోనే దీర్ఘమైన రైల్వే టన్నెల్ - T-50 (12.7 కిమీ) అంజీ ఖడ్‌ వంతెన - 725 మీటర్లు పొడవు, 96 కేబుల్స్‌తో ఒకే టికెట్‌తో ఢిల్లీ నుంచి కాశ్మీర్‌కు ప్రయాణం ఢిల్లీ నుంచి శ్రీనగర్ వరకు ప్రయాణించదలచిన వారు ఒకే టికెట్‌తో ప్రయాణించవచ్చు. అయితే భద్రతా కారణాలతో కాత్రా వద్ద దిగిపోయి మళ్లీ కాశ్మీర్‌ వైపు వేరే రైల్లో వెళ్లాల్సి ఉంటుంది. ప్రయాణికుల లగేజీ రెండుసార్లు స్కాన్ చేస్తారు. అంతేకాకుండా కాశ్మీర్‌లో రాత్రి సమయంలో రైళ్లు నడవవు. ప్రయాణాలన్నీ కేవలం పగటి పూటకే పరిమితం.

Details

విశేష లక్షణాలు కలిగిన వందే భారత్‌ 

కాష్మీర్ వర్షాల, మంచు ప్రభావానికి తట్టుకునే విధంగా ప్రత్యేకంగా వందే భారత్‌ రైలు రూపుదిద్దుకుంది. తక్కువ ఉష్ణోగ్రతల కోసం హీటింగ్‌ వ్యవస్థ, డ్రైవర్ కేబిన్‌లో డిఫ్రాస్టింగ్ గ్లాస్, మంచు వాతావరణంలో స్పష్టంగా కనబడేలా వీటిని తయారు చేశారు. ఆర్థిక, పర్యాటక అభివృద్ధికి కొత్త దారి ఈ రైల్వే ప్రాజెక్ట్‌తో కాశ్మీర్‌ లోయ తొలిసారి దేశంతో ప్రత్యక్ష రైలు కనెక్షన్ పొందింది. దీని ద్వారా యాపిల్స్, కాష్మీరీ షాల్లు, కస్మీరు జఫ్రాన్ లాంటి ఉత్పత్తులు సులభంగా దేశవ్యాప్తంగా పంపొచ్చు. ఇక పహల్గామ్‌, గుల్మార్గ్‌ వంటి పర్యాటక ప్రాంతాలకు ప్రాప్యత మెరుగవుతుంది. ఇందులో రైల్వే, టూరిజం, లాజిస్టిక్స్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి.