తెలంగాణ: చేప ప్రసాదం పంపిణీ ఎప్పుడో చెప్పిన మంత్రి తలసాని
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మహానగరంలో చేప ప్రసాదం ఫేమస్. అయితే ఇందుకు తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిని సోదరులు ఫ్రీగా పంపిణీ చేస్తుంటారు. ఎప్పటిలాగే ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందును పంపిణీ చేయనున్నారు.
జూన్ 9న మృగశిర కార్తె సందర్భంగా చేప మందును బత్తిని బ్రదర్స్ పంపిణీ చేయనున్నారని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
గురువారం మృగశిర కార్తె సందర్భాన్ని పురస్కరించుకుని ప్రసాదాన్ని బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తలసాని స్పష్టం చేశారు.
aas
ప్రసాదం ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు
కరోనా వ్యాప్తితో గడిచిన మూడేళ్లుగా చేప ప్రసాదాన్ని పంపిణి చేయలేదన్న మంత్రి, మళ్లీ ఈ సంవత్సరం నుంచే చేప మందును పంపిణీ చేస్తున్నామన్నారు.
ఈ మందు తీసుకునేందుకు తెలంగాణతో పాటు ఎక్కడెక్కడి నుంచో లక్షలాదిగా జనం వస్తారని మంత్రి వివరించారు.
ఇందుకోసం 250 మంది బత్తిని కుటుంబీకులు, వాలంటీర్‌లు నిరంతరం పని చేస్తున్నారని చెప్పిన మంత్రి , చేప ప్రసాదం ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా కార్తీ కౌంటర్లు పెంచామన్నారు.
ఈ మేరకు గోషామహల్ నియోజకవర్గ ప్రజలు సహకరించాలని మంత్రి అభ్యర్థించారు. టీఎస్ ఆర్టీసీ, మెట్రో సర్వీసులు, నాంపల్లి నుంచి రైల్వే సర్వీసులు అందరికీ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.