మణిపూర్: 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
ఇంఫాల్‌లో మంగళవారం పోలీసులకు,విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం మరోసారి ఇంటర్నెట్ సేవలపై ఐదు రోజుల నిషేధాన్ని అమలు చేసింది. ఇద్దరు యువకులను కిడ్నాప్ చేసి గుర్తుతెలియని దుండగులు హత్య చేయడంపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఫలితంగా 45మంది విద్యార్థులు గాయపడ్డారు,ఇందులో చాలా మంది బాలికలు ఉన్నారని అధికారులు తెలిపారు. మణిపూర్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. మొబైల్ ఇంటర్నెట్ డేటా సేవలను తాత్కాలిక నిలిపివేత అక్టోబర్ 1వ తేదీ రాత్రి 7:45 గంటల వరకు అంటే ఐదు రోజుల పాటు కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. శాంతిభద్రతల పరిస్థితుల దృష్ట్యా,సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఎటువంటి తప్పుడు సమాచారం లేదా ఇతర రకాల హింసాత్మక కార్యకలాపాల వ్యాప్తి, చెయ్యకూడదని పేర్కొంది.