NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి 
    మధ్యప్రదేశ్‌లో పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి

    Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 12, 2024
    08:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపు తప్పి.. జనంపైకి దూసుకెళ్లింది.

    ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 11 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి హోషంగాబాద్ జిల్లా అంచల్‌ఖేడా నుంచి పెళ్లి ఊరేగింపు పై ఓ ట్రక్కు అదుపు తప్పి జనం పైకి దూసుకెళ్లింది.

    ఈ ప్రమాదం 45వ జాతీయ రహదారిపై ఘాట్ ఖమారియా ప్రాంతంలో జరిగింది.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితులు అక్కడికక్కడే మరణించారు.

    గాయపడిన వ్యక్తులకు మొదట సుల్తాన్‌పూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించారు.

    ఆ తర్వాత వారందరినీ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) భోపాల్‌కు రిఫర్ చేశారు.

    Details 

    పరారైన ట్రక్కు డ్రైవర్ 

    ప్రమాద సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ అరవింద్ కుమార్ దూబే, పోలీసు సూపరింటెండెంట్ వికాస్ కుమార్ సెహ్వాల్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

    గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, ప్రమాదం జరిగిన తర్వాత డంపర్ ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని సెహ్వాల్ తెలిపారు.

    ఇదిలావుండగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అలానే గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    రోడ్డు ప్రమాదం

    తాజా

    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్
    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త
    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్

    మధ్యప్రదేశ్

    అదానీ బొగ్గు కుంభకోణం వల్లే విద్యుత్ ధరలు పెరిగాయ్: రాహుల్ గాంధీ విమర్శలు  రాహుల్ గాంధీ
    మధ్యప్రదేశ్: 92మంది అభ్యర్థులతో బీజేపీ 5వ విడత జాబితా రిలీజ్.. సింధియా అత్తకు నో టికెట్ బీజేపీ
    CPR To Snake : పాముకు సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన పోలీస్ భారతదేశం
    హేమమాలినితో డ్యాన్స్ చేయించామన్న హోంమంత్రి.. రాష్ట్రంలో రేగిన రాజకీయ దుమారం బీజేపీ

    రోడ్డు ప్రమాదం

    స్నేహితుల దినోత్సవం వేళ విషాదం.. కారు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు మృతి ఆంధ్రప్రదేశ్
    మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం; బస్సు బోల్తాపడి 24మంది మృతి మొరాకో
    రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి  రాజస్థాన్
    వరంగల్​లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం, ఇద్దరి విషమం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025