LOADING...
Rain Alert: తెలంగాణలో మరో ఐదు రోజుల వర్షాలు.. 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
తెలంగాణలో మరో ఐదు రోజుల వర్షాలు.. 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

Rain Alert: తెలంగాణలో మరో ఐదు రోజుల వర్షాలు.. 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2024
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇవాళ 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను కూడా జారీ చేశారు. ఉరుములు, మెరుపులు కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆదిలాబాద్‌, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు

Details

కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్

ఇక సిద్దిపేట,యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయివ్య దిశలో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉండటంతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా చాదర్ ఘాట్ ఎల్బీనగర్ మధ్యలో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది చోటుచేసుకుంది