Page Loader
Uttarpradesh: లక్నో సమీపంలో సిలిండర్ పేలుడు.. ఐదుగురి మృతి 
లక్నో సమీపంలో సిలిండర్ పేలుడు.

Uttarpradesh: లక్నో సమీపంలో సిలిండర్ పేలుడు.. ఐదుగురి మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2024
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో సమీపంలోని కకోరిలో మంగళవారం రాత్రి జరిగిన సిలిండర్ పేలుడులో ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు కుటుంబ సభ్యులు మరణించారు. పేలుడు కారణంగా మరో నలుగురు కుటుంబ సభ్యులు గాయపడినట్లు సమాచారం. మృతులు 50 ఏళ్ల జర్దోసీ కళాకారులు మున్షీర్ అలీ, అతని భార్య హుస్నా బానో, మున్షీర్ మేనకోడళ్లు హుమా, రుయా, 2 ఏళ్ల హీబాతో సహా ముగ్గురు పిల్లలు. ఈ పేలుడు వల్ల గది గోడ ఎగిరిపోయింది. సమీపంలోని ఇళ్ళు కూడా దెబ్బతిన్నాయి. పేలుడు శబ్ధం కూడా దూరంగా వినిపించినట్లు సమాచారం. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Details

పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు

సంఘటనా స్థలానికి చేరుకున్న వారిలో లక్నో చీఫ్ ఫైర్ ఆఫీసర్ మంగేష్ కుమార్ కూడా ఉన్నారు. గాయపడిన నలుగురిని లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడుకు గల కారణాలు, ఏ పరిస్థితుల్లో జరిగిందనేది ఇంకా తెలియరాలేదు. మృతుల పంచనామా నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 లక్నో సమీపంలోని కకోరిలో సిలిండర్ పేలుడు