బెంగళూరు మహానగరంలో భారీ పేలుళ్లకు యత్నం.. ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్
భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ, ఎలక్ట్రానిక్ మహానగరం బెంగళూరులో బాంబుల కలకలం రేగింది. ఈ మేరకు పోలీసులు భారీ ఉగ్రదాడిని భగ్నం చేశారు. సిటీ అంతటా బ్లాస్టులకు ప్లాన్ చేసిన ఐదుగురు తీవ్రవాదులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అదుపులోకి తీసుకుంది. నిందితులను జునైద్, సోహైల్, ఉమర్, ముదాసిర్, జాహిద్‌లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో వారి సెల్ ఫోన్లు సహా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 2017లో జరిగిన ఓ హత్య కేసుతో ఈ ఐదుగురు నిందితులకు సంబంధం ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. గతంలో జైల్లో ఉండగా, వారికి కొందరు ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందన్నారు. ఈ క్రమంలోనే పేలుడు పదార్థాల తయారీలో శిక్షణ పొందినట్లు అంచనాకు వచ్చారు.