Page Loader
NHRC: ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం 
ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం

NHRC: ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2024
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. అయితే ఈ ఎంపికపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా, ఛైర్మన్ ఎంపికలో సరైన విధానాన్ని అనుసరించలేదని, ఈ ప్రక్రియ ప్రాథమిక స్థాయిలోనే లోపభూయిష్టంగా ఉందని ఆ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ''ఇలాంటి ముఖ్యమైన అంశాల్లో సంప్రదాయమైన పరస్పర చర్చలు, ఏకాభిప్రాయం సాధన వంటి ప్రక్రియలను విస్మరించారు. సమావేశంలో లేవనెత్తిన చట్టపరమైన ఆందోళనలను పక్కనపెట్టి, సంఖ్యాపరమైన మెజార్టీ ఆధారంగా పేర్లను ఖరారు చేశారు'' అని కాంగ్రెస్ ఆరోపించింది.

వివరాలు 

ప్రస్తుత యాక్టింగ్ ఛైర్‌పర్సన్‌గా విజయభారతీ సయానీ

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన జస్టిస్ అరుణ్‌కుమార్ మిశ్రా ఈ ఏడాది జూన్ 1న పదవీ విరమణ చేయగా, విజయభారతీ సయానీ ప్రస్తుతం యాక్టింగ్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. కొత్త ఛైర్‌పర్సన్ ఎంపిక కోసం డిసెంబర్ 18న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో జస్టిస్ రామసుబ్రమణియన్‌ను నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక, సభ్యులుగా ప్రియాంక్ కనూంగో, డాక్టర్ జస్టిస్ బిద్యుత్‌రంజన్ షడంగిలను కూడా నియమించారు.