Page Loader
Baba Siddique:ఫ్లైట్ మోడ్, వైఫై: బాబా సిద్ధిక్ హత్య నిందితుడు అన్మోల్ బిష్ణోయ్‌ని ఎలా సంప్రదించాడంటే..! 
ఫ్లైట్ మోడ్, వైఫై: బాబా సిద్ధిక్ హత్య నిందితుడు అన్మోల్ బిష్ణోయ్‌ని ఎలా సంప్రదించాడంటే..!

Baba Siddique:ఫ్లైట్ మోడ్, వైఫై: బాబా సిద్ధిక్ హత్య నిందితుడు అన్మోల్ బిష్ణోయ్‌ని ఎలా సంప్రదించాడంటే..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 22, 2024
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితులు దర్యాప్తు అధికారుల దృష్టికి దొరక్కుండా చాలా పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడు ఆకాశ్‌దీప్‌ గిల్‌ను పోలీసులు విచారించగా ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. కీలక వ్యూహం: ఆకాశ్‌దీప్‌ తన మాటల ప్రకారం, తన వ్యవసాయ కూలీ బల్వీందర్‌ హాట్‌స్పాట్‌ ద్వారా ఇంటర్నెట్‌ను ఉపయోగించి, సూత్రధారి అన్మోల్‌ బిష్ణోయ్‌తో పాటు ఇతర నిందితులైన శుభం లోంకర్‌, జీషాన్‌ అక్తర్‌, షూటర్‌ శివమ్‌కుమార్‌ గౌతమ్‌లతో సంభాషించినట్లు చెప్పారు.

వివరాలు 

మాయమాటల మాయాజాలం

బల్వీందర్‌ హాట్‌స్పాట్‌ను ఉపయోగించడం ద్వారా తన స్థానం (లొకేషన్‌)ను గుర్తించకుండా ఆకాశ్‌దీప్‌ జాగ్రత్తగా వ్యవహరించాడు. అతడిని నవంబర్‌ 16న పంజాబ్‌లోని ఫజ్లికాలో పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో గిల్‌ తన మొబైల్‌ను ఫ్లైట్‌ మోడ్‌లో ఉంచి బల్వీందర్‌ హాట్‌స్పాట్‌ను వాడినట్లు వెల్లడించారు. గిల్‌ ఫోన్‌ను ఇప్పుడు తీవ్రస్థాయిలో పోలీసులు గాలింపు చేపట్టారు.దానిలో ఉన్న డేటా కేసుకు మరింత సహాయపడవచ్చని భావిస్తున్నారు.

వివరాలు 

అరెస్టులు,విచారణ: 

ఈ కేసులో ఇప్పటివరకు 24 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల లాజిస్టిక్స్‌కు సాయం చేసిన ప్రధాన వ్యక్తిగా గిల్‌ పేరుకు వచ్చింది. ముంబయి కోర్టు నవంబర్‌ 23 వరకు అతని పోలీస్ కస్టడీని పొడిగించింది. అక్టోబర్‌ 12న ముంబయిలోని తన కుమారుడి కార్యాలయంలో ఉన్న బాబా సిద్ధిఖీపై దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన సిద్ధిఖీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆసుపత్రిలో ప్రధాన నిందితుడు శివ్‌కుమార్‌ దాదాపు 30 నిమిషాల పాటు ఉండి, సిద్ధిఖీ మరణం ఖాయమని తెలిసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు గుర్తించారు. ఈ హత్య కేసులో ఉపయోగించిన తుపాకీని పోలీసులు ఇంకా రికవరీ చేయలేకపోయారు. దర్యాప్తు కొనసాగుతుండగా, మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.