LOADING...
Yamuna River: ప్రమాదకర స్థాయిని దాటిన యమునా నది..ఢిల్లీకి వరద ముప్పు 
ప్రమాదకర స్థాయిని దాటిన యమునా నది..ఢిల్లీకి వరద ముప్పు

Yamuna River: ప్రమాదకర స్థాయిని దాటిన యమునా నది..ఢిల్లీకి వరద ముప్పు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2025
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీకి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. యమునా నది నీటి మట్టం ప్రమాద సూచిక స్థాయికి చేరువవుతున్నట్టు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద నది నీటి స్థాయి 204.5 మీటర్లకు పెరిగినట్టు రికార్డు చేశారు. నదీ ప్రవాహం 205.33 మీటర్లకు చేరితే పరిస్థితి అత్యంత ప్రమాదకరమవుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, హత్నికుండ్ డ్యామ్‌ నుంచి అధికంగా నీటిని వదులుతున్న కారణంగా యమునా ప్రవాహం మరింత వేగంగా పెరుగుతోందని చెప్పారు. ఈ పరిస్థితులను పరిశీలిస్తే, మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో యమునా నది నీరు డేంజర్ మార్క్‌ను మించవచ్చని అంచనా వేశారు.

వివరాలు 

రెండు బ్యారేజీల నుంచి విడుదలైన నీరు ఢిల్లీ చేరుకోవడానికి సుమారు 48 నుంచి 50 గంటలు

దీంతో నది ఒడ్డున నివసించే ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. హత్నికుండ్ బ్యారేజ్‌ నుంచి ప్రస్తుతం 1.27 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా, వజీరాబాద్ బ్యారేజీ నుంచి 46 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు సమాచారం. ఈ రెండు బ్యారేజీల నుంచి విడుదలైన నీరు ఢిల్లీ చేరుకోవడానికి సుమారు 48 నుంచి 50 గంటలు పట్టనుందని అధికారులు వివరించారు. దాంతో ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగే అవకాశముందని హెచ్చరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఢిల్లీకి వరద హెచ్చరిక జారీ