Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 70 గేట్లను పూర్తిగా ఎత్తివేయడంతో, సముద్రంలోకి 5,66,860 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరోవైపు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రకాశం బ్యారేజీలోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి 500 క్యూసెక్కుల నీరు కాల్వలకు విడుదల చేయగా, ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు రావడం కురవడంతో బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాం : సీఎం
రెవెన్యూ అధికారులు నదీ పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించారు. కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండి, పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో పలు గ్రామాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఏపీలో వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 10 మంది మృత్యువాత పడ్డారు.