Page Loader
Nagarjuna Sagar: నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు జలకళ.. ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌కు కృష్ణా న‌దిలో వ‌ర‌ద ప్ర‌వాహం 
ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌కు కృష్ణా న‌దిలో వ‌ర‌ద ప్ర‌వాహం

Nagarjuna Sagar: నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు జలకళ.. ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌కు కృష్ణా న‌దిలో వ‌ర‌ద ప్ర‌వాహం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుండి శ్రీశైలానికి వరద నీరు వేగంగా చేరుతోంది. శ్రీశైలం డ్యాం నుంచి నాగార్జునసాగర్ దిశగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఫలితంగా నాగార్జునసాగర్ జలాశయం నిండుతుండటంతో సాగర్ పరిసర ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం సాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో 65,094 క్యూసెక్కులుగా నమోదు కాగా, ఔట్‌ఫ్లో 1,650 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 557.80 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం అందులో 227.2912 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.