Page Loader
Nagarjuna Sagar: సాగర్‌లో కొనసాగుతున్న వరద ప్రవాహం.. 535 అడుగులకు చేరిన  నీటిమట్టం
సాగర్‌లో కొనసాగుతున్న వరద ప్రవాహం.. 535 అడుగులకు చేరిన నీటిమట్టం

Nagarjuna Sagar: సాగర్‌లో కొనసాగుతున్న వరద ప్రవాహం.. 535 అడుగులకు చేరిన  నీటిమట్టం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2025
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎగువ ప్రాంతాల నుంచి వరదనీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో నాగార్జునసాగర్‌ జలాశయంలో నీటిమట్టం స్థిరంగా పెరుగుతోంది. బుధవారం రాత్రి 9గంటల వరకు వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం,శ్రీశైలం జలాశయం నుంచి 1,16,757 క్యూసెక్కుల వరదనీరు సాగర్‌ వైపు ప్రవహిస్తోంది. ఈ నీటి ప్రవాహంతో సాగర్‌ జలాశయంలోని నీటిమట్టం 535.10అడుగులకు చేరింది. ప్రస్తుత నీటి ఒత్తిడిని తగ్గించేందుకు సాగర్‌ జలాశయం నుంచి నీటిని విడిదల చేస్తున్నారు. ఎడమ కాల్వ ద్వారా 3,146క్యూసెక్కులు,ఎస్‌ఎల్‌బీసీ (ఎస్‌ఎల్‌బిసి) ద్వారా మరో 1,500క్యూసెక్కుల నీటిని కలిపి మొత్తం 4,646క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో ప్రధాన ఆనకట్ట ఎడమ వైపున ఉన్న మట్టి కట్టకు నీరు తాకింది. దీనితో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.