LOADING...
After Ceasefire: పహల్గాం తర్వాత తొలిసారి సరిహద్దుల్లో ప్రశాంతమైన రాత్రి
పహల్గాం తర్వాత తొలిసారి సరిహద్దుల్లో ప్రశాంతమైన రాత్రి

After Ceasefire: పహల్గాం తర్వాత తొలిసారి సరిహద్దుల్లో ప్రశాంతమైన రాత్రి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 12, 2025
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన రెండు రోజుల తర్వాత జమ్ముకశ్మీర్‌తో పాటు అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో తాత్కాలికంగా శాంతియుత వాతావరణం నెలకొన్నదని భారత సైన్యం వెల్లడించింది. కాల్పుల విరమణ శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చిన కారణంగా గత రాత్రి ప్రశాంతంగా గడిచిందని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడి అనంతరం నాలుగు రోజులపాటు భారత్-పాకిస్తాన్‌ మధ్య పరస్పర కాల్పులు తీవ్రంగా కొనసాగాయి. దీనితో ఉత్కంఠ నెలకొనగా, ఈ నేపథ్యంలో ఇరుదేశాల డైరెక్టర్ల జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (DGMO) మధ్య చర్చలు జరిగాయి.

Details

ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్

ఆ చర్చల ఫలితంగా శనివారం సాయంత్రం నుంచే భూమి, ఆకాశం, సముద్రం మీద అన్ని రకాల సైనిక చర్యలను నిలిపివేయాలన్న ఒప్పందం కుదిరింది. కానీ ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తత వైపు మళ్లింది. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌తో పాటు గుజరాత్‌ లోని కొన్ని ప్రాంతాల్లో అనుమానాస్పద డ్రోన్ల చలనం కనిపించింది. ఈ డ్రోన్లను భారత భద్రతా దళాలు గుర్తించి వెంటనే అడ్డుకున్నాయి. శనివారం అర్ధరాత్రి సమయంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడుతూ, ఇదే రోజున భారత్-పాకిస్తాన్ DGMOల మధ్య జరిగిన చర్చల ఆధారంగా వచ్చిన ఒప్పందాన్ని పాకిస్తాన్ వెంటనే ఉల్లంఘించిందని ఆరోపించారు.

Details

సైన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ

''ఇది అత్యంత తీవ్రతరమైన అంశంగా పరిగణిస్తున్నాం. సరిహద్దుల్లో ఇటువంటి ఉల్లంఘనలు మళ్లీ జరిగితే, తగినదిగా, గట్టిగా ప్రతిస్పందించేందుకు సైన్యానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని ఆయన స్పష్టం చేశారు. ఇంతలో పహల్గాం ఉగ్రదాడికి పాకిస్తాన్‌కు సంబంధాలు ఉన్నట్టు నిర్ధారణ తర్వాత, భారత్‌ మే 7న ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట పాక్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల ద్వారా ఉగ్రవాదంపై భారత్ తేలికపాటి స్పందనకాదు, స్పష్టమైన, గట్టైన సంకేతం పంపినట్లు రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి.