Madhya Pradesh: నలుగురు పిల్లల్ని కనే వారికి రూ. 1 లక్ష.. మధ్యప్రదేశ్ బోర్డు ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పరశురామ్ కల్యాణ్ బోర్డు తమ కమ్యూనిటీని విస్తరించేందుకు నూతన చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలో బ్రాహ్మణ దంపతులను ఎక్కువ సంతానం కలిగించడానికి ప్రోత్సహిస్తూ, నలుగురు పిల్లలను కనే వారికి రూ. 1 లక్ష నజరానా అందజేస్తామని ప్రకటించింది.
ఈ ప్రకటనను భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పరశురామ్ కళ్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా చేశారు.
మన కుటుంబాలపై దృష్టి పెట్టడం మానేయడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ రోజుల్లో యువత ఒక్క బిడ్డకే పరిమితమవుతున్నారని చెప్పారు.
Details
బ్రాహ్మణ మహిళలకు బోర్డు తరఫున సాయం
ఇది భవిష్యత్‌కు హానికరమన్నారు. కొత్త తరాలను కాపాడేందుకు కనీసం నలుగురు పిల్లలు ఉండేలా చూసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
అదనంగా నలుగురు పిల్లల్ని కనే బ్రాహ్మణ మహిళలకు బోర్డు తరఫున రూ. 1 లక్ష నజరానా అందజేస్తామని, తాను అధ్యక్షుడిగా తన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ఈ అవార్డు కొనసాగుతుందని పండిత్ రాజోరియా తెలిపారు.
ఈ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.