Chandra Babu: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
న్యాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలులో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో 100 ఎకరాల్లో లీగల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేలు గౌరవ వేతనం
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన నిర్ణయించారు. ముఖ్యమంత్రి, నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉన్నట్లు సత్వర నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా జూనియర్ న్యాయవాదులకు నెలకి రూ.10 వేలు గౌరవ వేతనం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి చంద్రబాబు నాయుడు ఉందన్నారు.