Meghalaya : మేఘాలయ మాజీ సీఎం సాల్సెంగ్ మారక్ కన్నుమూత
మేఘాలయ మాజీ సీఎం సాల్సెంగ్ మారక్ (82) కన్నుముశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 82 ఏళ్ల వయస్సు గల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తురా సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మేఘాలయలో ఐదేళ్ల పదవి కాలం పూర్తి చేసుకున్న తొలి ముఖ్యమంత్రిగా 1993లో ఆయన రికార్డుకెక్కాడు. ఇక 1998లో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణం కుప్పకూలినప్పుడు అతి తక్కువ సమయం అంటే 12 రోజులు సీఎంగా పనిచేశారు.
మూడ్రోజుల పాటు సంతాప దినాలు
2003లో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా కూడా ఆయన పని చేశారు. సాల్సెంగ్ మారక్ మృతికి నివాళులర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. 1941లో జన్మించిన మారక్ జన్మించారు. ఆయన కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కళాశాలలో చదువుకున్నారు. మేఘాలయలోని నార్త్ గారో హిల్స్‌లోని రెసుబెల్‌పరా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.