Page Loader
Buddhabed Bhattacharya: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్జీ కన్నుమూత
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్జీ కన్నుమూత

Buddhabed Bhattacharya: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్జీ కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2024
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ(80) గురువారం ఉదయం 8:20 గంటలకు కన్నుముశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని బల్లిగంజ్‌ వద్దనున్న తన స్వగృహంలో మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం వెల్లడించారు. ఆయనకు భార్య మీరా, కుమార్తె సుచేత ఉన్నారు. 2000-2011 వరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు.

Details

సీపీఎం నాయకులు సంతాపం

కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదు. ఊపిరితిత్తులు, శ్యాసకోశ సంబంధిత సమస్యలతో కొంతకాలంగా ఆయన పోరాడుతున్నాడు. కమ్యూనిస్టు యోధుడు జ్యోతి బసు తర్వాత 2000వ సంవత్సరంలో బెంగాల్ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 1977లో తొలిసారి కాశిపుర్-బెల్గాచియా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2001, 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చారు. బుద్ధదేవ్ భట్టాచార్జీ మృతి పట్ల సీపీఎం నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.