Page Loader
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ అరెస్ట్; ఆదాయానికి మించిన ఆస్తులే కారణం
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ అరెస్ట్; ఆదాయానికి మించిన ఆస్తులే కారణం

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ అరెస్ట్; ఆదాయానికి మించిన ఆస్తులే కారణం

వ్రాసిన వారు Stalin
Jul 10, 2023
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

2016 నుంచి 2022 మధ్య కాంగ్రెస్ పాలనలో ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఓపీ సోనీని విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశాల మేరకు అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యల్లో భాగంగా ఓపీ సోనిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1, 2016నుంచి మార్చి 31, 2022 వరకు సోనీ, అతని కుటుంబం ఆదాయం రూ.4.52కోట్లు కాగా, వారి ఖర్చు రూ.12.48కోట్లుగా తేలింది. దీంతో ఈ వ్యయం వారి ఆదాయ వనరుల కంటే 176.08%మించిపోయినట్లు విజిలెన్స్ అభియోగాలు మోపింది. ఓపీ సోనీ ఈ కాలంలో తన భార్య సుమన్ సోనీ, కుమారుడు రాఘవ్ సోనీ పేరిట ఆస్తులు సంపాదించారని అధికారులు చెబుతున్నారు.

పంజాబ్

అవినీతి కేసులో అరెస్టైన నాలుగో కాంగ్రెస్ నేత సోనీ

అంతకుముందు సోనీ అమృత్‌సర్‌లోని విజిలెన్స్ బ్యూరో ఎదుట హాజరై విచారణలో పాల్గొన్నారు. సోనీ ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ బ్యూరోకి అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిగింది. మేలో అవినీతి ఆరోపణల కేసులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కుశాల్‌దీప్ సింగ్ ధిల్లాన్‌ను కూడా పంజాబ్ విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి పట్ల కఠినంగా వ్యవహరిస్తోందని, తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆప్ చెబుతోంది. అవినీతి కేసులో విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసిన నాలుగో కాంగ్రెస్ నేత ఓపీ సోనీ. గతంలో కాంగ్రెస్ నాయకులు భరత్ భూషణ్ అషు, సాధు సింగ్ ధరమ్‌సోత్‌ విజిలెన్స్ కేసులను ఎదుర్కొంటున్నారు.