Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు
ఈ వార్తాకథనం ఏంటి
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గ, మైహోం భుజా వద్ద ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.
గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగురోడ్డు ద్వారా ఆయనను తీసుకెళ్లుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఈ అరెస్ట్ జరిగింది. ప్రస్తుతం వల్లభనేని వంశీ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఆయనను ఏ1 నిందితుడిగా చేర్చారు.
బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వంశీ ఏ2గా ఉన్నారు.
Details
పలు కేసుల్లో నిందితుడిగా వంశీ
అలాగే, ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు నమోదైంది.
గన్నవరం మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్‌లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో కూడా వంశీ నిందితుడిగా ఉన్నారు.