గన్నవరం: వార్తలు

గన్నవరం ఘర్షణ: రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత పట్టాభి

గన్నవరం ఘటనలో పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని న్యాయమూర్తి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.

పట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు

గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ- టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో పట్టాభితో పాటు మరో 11మంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

'24గంటలుగా నా భర్త కనిపించడం లేదు'; టీడీపీ నేత పట్టాభి భార్య నిరసన

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మద్దతుదారులు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ ఎపిసోడ్‌తో కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.

టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు

గన్నవరం నియోజకవర్గంలో మంగళవారం కూడా టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. గన్నవరం ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తూ ఇతర ప్రాంతాల ప్రజలను నియోజకవర్గంలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.