
Vallabhaneni Vamsi Case: కిడ్నాప్, బెదిరింపు కేసుల్లో వల్లభనేని వంశీకి మరోసారి షాక్
ఈ వార్తాకథనం ఏంటి
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది.
కోర్టు తీర్పు మేరకు ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్‌ను కొనసాగించాలని నిర్ణయించింది.
ఇదిలా ఉండగా, ఈ కేసులో ఇవాళ్టితో వంశీ రిమాండ్ ముగియడంతో, గన్నవరం పోలీసులు ఆయనను కోర్టుకు తీసుకెళ్లారు.
ఇక వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది.
ఈ నేపథ్యంలో వంశీకి బెయిల్ వస్తుందా? లేక మరోసారి నిరాశ ఎదురవుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది
Details
బెయిల్ కోరుతూ పిటిషన్
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గురువారం సీఐడీ కోర్టు ఖారిజ చేసిన విషయం తెలిసిందే.
ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా వంశీ బెయిల్ కోరుతూ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేశారు.
ఈ కేసులోనూ నేడు తీర్పు వెలువడనుండడంతో, వంశీకి బెయిల్ మంజూరు అవుతుందా? లేక రిమాండ్ కొనసాగుతుందా? అనే ప్రశ్నలు నెలకొన్నాయి.
ప్రస్తుతం సత్యవర్ధన్‌ను బెదిరించడం, కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీ మోహన్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
దీంతో ఈసారి అయినా ఆయనకు బెయిల్ లభిస్తుందా? అనే అంశం ఆసక్తిగా మారింది.