
టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
గన్నవరం నియోజకవర్గంలో మంగళవారం కూడా టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. గన్నవరం ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తూ ఇతర ప్రాంతాల ప్రజలను నియోజకవర్గంలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
సోమవారం సాయంత్రం వల్లభనేని వంశీ వర్గీయులు టీడీపీ కార్యాలయంపైనా దాడి చేసిన ధంసం చేసినట్లు నాయుకులు ఆరోపించారు. ఈ క్రమంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేత మధ్య ఘర్షణ మొదలైంది.
రెండు వర్గాల ఘర్షణ నేపథ్యంలో పలు కార్లు ధ్వంసమయ్యాయి. దాడులకు పాల్పడిన 16మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వల్లభనేని వంశీ నియోజకవర్గంలో అల్లర్లను రెచ్చగొడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా.. బయటి వ్యక్తులు మాత్రం నియోజకవర్గంలో ఏం చేస్తున్నారని వల్లభనేని వంశీ ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
డీజీపీకి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు
మరోవైపు టీడీపీ కార్యాలయం ధ్వంసానికి నిరసనగా తెలుగుదేశం నాయకత్వం ఛలో గన్నవరం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తున్నారు. గొల్లపూడిలో దేవినేని ఉమ, బోండా ఉమ, విజయవాడలో బుద్దా వెంకన్న వంటి నేతలను గృహనిర్బంధం చేశారు.
ఈ ఘటనలపై స్పందించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులు, హింసాత్మక ఘటనలపై డీజీపీకి లేఖ రాశారు. టీడీపీ నాయకులు దొంతు చిన్నా, పట్టాభి భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.