
Vallabhaneni Vamsi: కస్టడీలో వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
ఈ వార్తాకథనం ఏంటి
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
నకిలీ ఇండ్ల పట్టాలకు సంబంధించిన కేసులో కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది.
శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వంశీ, ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వంశీ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిన విషయం తెలుసుకున్న ఆయన భార్య పంకజశ్రీ వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు.
మాజీ మంత్రి పేర్ని నాని కూడా అక్కడికి వచ్చి వంశీ ఆరోగ్యంపై ఆరా తీశారు. వంశీ కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Details
వంశీకి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ, వంశీకి మెరుగైన వైద్యసదుపాయాలు కలిగిన ఆసుపత్రిలో చికిత్స అవసరమని తెలిపారు.
"ప్రస్తుతం వంశీ తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
కంకిపాడు ఆసుపత్రిలో పరిమిత వనరులే ఉన్నందున, ఆయన్ను వెంటనే ఎయిమ్స్ వంటి అధునాతన వైద్యసదుపాయాలున్న ఆసుపత్రికి తరలించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రస్తుతం వంశీ ఆరోగ్యంపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
అదనపు పరీక్షల అనంతరం అవసరమైతే ఆయనను ప్రత్యేక వైద్యసదుపాయాలకు తరలించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.