Page Loader
గన్నవరం ఘర్షణ: రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత పట్టాభి
గన్నవరం ఘర్షణ: రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత పట్టాభి

గన్నవరం ఘర్షణ: రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత పట్టాభి

వ్రాసిన వారు Stalin
Feb 23, 2023
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

గన్నవరం ఘటనలో పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని న్యాయమూర్తి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో పట్టుబడిన పట్టాభితోపాటు మరో పది మందిని గన్నవరం పోలీసులు ప్రత్యేక వాహనంలో బుధవారం రాత్రి 9.15 గంటలకు తీసుకొచ్చి వారికి అప్పగించినట్లు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్ రాజారావు తెలిపారు. అంతకుముందు అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆదేశాల మేరకు ప్రభుత్వాసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారి శ్రీకాంత్ ఇచ్చిన నివేదికను పోలీసులు తిరిగి కోర్టుకు సమర్పించారు.

గన్నవరం

'గన్నవరం సబ్ జైలులో అయితే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం'

పట్టాభి ఆరోగ్యం నిలకడగా ఉందని, రెండు అరచేతులకు చిన్న గాయాలు ఉన్నాయని వైద్య నివేదికలో పేర్కొన్నారు. ఆయితే గాయాలు 24 నుంచి 36 గంటల మధ్య అయి ఉండొచ్చని నివేదికలో వివరించారు. వైద్యుల నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి పట్టాభిని రిమాండ్ నిమిత్తం గన్నవరం సబ్ జైలుకు తరలించాలని ఆదేశించారు. పోలీసులు అతడిని తీసుకెళ్లి జైలు అధికారులకు అప్పగించారు. అయితే గన్నవరం సబ్ జైలులో అయితే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు చెప్పగా, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు.