
'24గంటలుగా నా భర్త కనిపించడం లేదు'; టీడీపీ నేత పట్టాభి భార్య నిరసన
ఈ వార్తాకథనం ఏంటి
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మద్దతుదారులు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ ఎపిసోడ్‌తో కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.
గన్నవరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనల జరగకుండా ఉండేందుకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో పలువురు నాయకులను అరెస్టు చేశారు.
ఇదే సమయంలో టీడీపీ సీనియర్ నేత పట్టాభి రామ్ గత 24 గంటల నుంచి కనిపించడం లేదని ఆయన భార్య చందన నిరసనకు దిగారు. అనంతరం ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
గన్నవరం
నా భర్తకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్, డీజీపీలే బాధ్యత వహించాలి: చందన
ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడి చేసిన టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించేందుకు తన భర్త పట్టాభి బయటకు వచ్చారని చందన చెప్పారు.
మార్గమధ్యంలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారని, అయితే 24 గంటలు గడిచినా అతని ఆచూకీపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు.
సోమవారం రాత్రి ఫిర్యాదు చేసినా పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. తన భర్తకు ఏదైనా హాని జరిగితే దానికి ఏపీ సీఎం జగన్, ఏపీ డీజీపీలే బాధ్యత వహించాలని చందన అన్నారు.
పట్టాభి గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు సమచారం. ఈ క్రమంలో ఆమె పట్టాభిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.