Page Loader
Tamilisai Soundararajan: మళ్ళీ బీజేపీలో చేరిన తెలంగాణః మాజీ గవర్నర్ తమిళిసై
మళ్ళీ బీజేపీలో చేరిన తెలంగాణః మాజీ గవర్నర్ తమిళిసై

Tamilisai Soundararajan: మళ్ళీ బీజేపీలో చేరిన తెలంగాణః మాజీ గవర్నర్ తమిళిసై

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2024
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరిగి బీజేపీలో చేరారు. పార్టీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. తమిళసై గతంలో బీజేపీ నాయకురాలు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2019లో తెలంగాణ గవర్నర్‌గా వచ్చిన ఆమె.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె మళ్లీ బీజేపీలో చేరారని వామపక్షాలు, డీఎంకే విమర్శించాయి. వారి విమర్శలకు అన్నామలై గట్టి కౌంటర్ ఇచ్చారు. పదవీ విరమణ తర్వాత సామాన్య పౌరుడిలా ప్రజాసేవలో ఉండాలంటే బీజేపీలోనే సాధ్యమన్నారు.

Details 

ప్రతిపక్షాలకు రాజకీయం అంటే ఉన్నత పదవులు మాత్రమే: అన్నామలై

ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నత పదవులను వదులుకోవడం లేదని, ఎందుకంటే వారికి రాజకీయం అంటే ఉన్నత పదవులు మాత్రమేనని విమర్శించారు. కానీ బీజేపీలో మాత్రం ప్రజాసేవ అన్నారు. గవర్నర్‌గా తమిళసై సౌందరరాజన్‌ చక్కగా పనిచేశారని అన్నారు. ఆ పదవికి రాజీనామా చేసి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకోవడం ఆమెకు ప్రజలపై ఉన్న ప్రేమను తెలియజేస్తోందన్నారు. అదే స‌మ‌యంలో మ‌ళ్లీ బీజేపీలో చేర‌డం ద్వారా ఆమె పార్టీ ప‌ట్ల ఉన్న నిబ‌ద్ధ‌త‌ను చాటుకుంటున్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడానికి ఆమె సహకరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.