Page Loader
Bengaluru :ఉద్యోగం కోల్పోయి దొంగగా మారిన బెంగళూరు టెక్కీ.. అరెస్ట్
కోవిడ్ సమయంలో ఉద్యోగం కోల్పోయి దొంగగా మారిన బెంగళూరు టెక్కీ, అరెస్ట్

Bengaluru :ఉద్యోగం కోల్పోయి దొంగగా మారిన బెంగళూరు టెక్కీ.. అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 29, 2024
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొవిడ్ సంక్షోభంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాగే ఉద్యోగం పోగొట్టుకున్న ఓ ఐటీ ఉద్యోగి డబ్బు కోసం చోరీలకు అలవాటు పడింది. బెంగళూరులో పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహాల నుంచి రూ. 10 లక్షలకు పైగా విలువైన 24 ల్యాప్‌టాప్‌లను దొంగిలించినందుకు 26 ఏళ్ల మాజీ ఐటీ ఉద్యోగిని అరెస్టు చేశారు. నోయిడాకి చెందిన జాస్సీ అగర్వాల్ ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చింది. కోవిడ్ సమయంలో ఆమె ఉద్యోగం కోల్పోయింది. అప్పటి నుంచే సులువుగా డబ్బులు సంపాదించుకోడానికి అలవాటు పడింది. అలా దొంగతనాలు చెయ్యడం మొదలు పెట్టింది. ఆ తర్వాత పీజీల నుంచి ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్‌లను దొంగిలించి వాటిని బ్లాక్ మార్కెట్‌లో అమ్మింది.

Details 

 రూ.10-15 లక్షలకు పైగా విలువైన 24 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం 

ఛార్జింగ్ పెట్టి ఉన్న ల్యాప్‌టాప్‌లను ఎవరికీ తెలియకుండా కొట్టేసి వాటిని నోయిడాలోని బ్లాక్‌మార్కెట్‌లో అమ్మేది. చాలా ల్యాప్‌టాప్‌లు మాయమైనట్లు పీజీ నివాసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జెస్సి ఈ దొంగతనాలు చేస్తోందని తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుండి రూ.10-15 లక్షలకు పైగా విలువైన 24 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. జెస్సి చాలా పీజీల నుంచి ల్యాప్‌టాప్‌లు చోరీ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రంగంలోకి దిగిన క్రైమ్‌ బ్రాంచ్ అన్ని చోట్లా సిసి కెమెరా ఫుటేజ్‌ని పరిశీలిస్తోంది.