తదుపరి వార్తా కథనం

Shibu Soren : జార్ఖండ్ మాజీ సీఎం కన్నుమూత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 04, 2025
10:03 am
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ కన్నుమూశారు. తాజాగా ఆయన మరణవార్త వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా విషాదచాయలు అలుముకున్నాయి. ఆదివాసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన శిబూ సోరెన్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన, కేంద్ర మంత్రిగా కూడా పదవులు నిర్వహించారు. ఎన్నో దశాబ్దాల రాజకీయ జీవితం గడిపిన శిబూ సోరెన్ మృతితో జార్ఖండ్ రాష్ట్రానికి తీరని లోటు ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.