Page Loader
Sita Soren: బీజేపీలో చేరిన జార్ఖండ్‌ నేత సీతా సోరెన్‌ 
Sita Soren: బీజేపీలో చేరిన జార్ఖండ్‌ నేత సీతా సోరెన్‌

Sita Soren: బీజేపీలో చేరిన జార్ఖండ్‌ నేత సీతా సోరెన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 19, 2024
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM)కి రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత,పార్టీ చీఫ్ శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ మంగళవారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ఎమ్మెల్యే పదవికి కూడా ఆమె రాజీనామా చేయడం గమనార్హం. అంతకుముందు రోజు, సీతా సోరెన్ తన కుటుంబం తనను పక్కన పెట్టారని ఆరోపణలను చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. తన భర్త దుర్గా సోరెన్‌ మరణానంతరం పార్టీ తనకు, తన కుటుంబానికి తగిన సహాయాన్ని అందించడంలో విఫలమైందని సీత పార్టీ అధిష్టానం, తన బావ శిబు సోరెన్‌కు పంపిన రాజీనామా లేఖలో తన మనోవేదనను వ్యక్తం చేసింది. తాను నిర్లక్ష్యానికి గురవుతున్నానని, అయిష్టంగానే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీజేపీ లో చేరుతున్న సీతా సోరెన్