LOADING...
V.S. Achuthanandan: కేరళ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
కేరళ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

V.S. Achuthanandan: కేరళ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2025
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కమ్యూనిస్ట్ నేత వి.ఎస్. అచ్యుతానందన్ (వయస్సు 101) మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, తిరువనంతపురంలోని ఎస్‌యు.టి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత నెల 23న హఠాత్తుగా గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చేరగా, అప్పటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటూ చివరకు కన్నుమూశారు. వి.ఎస్. అచ్యుతానందన్ 1964లో సీపీఐ నుంచి విడిపోయిన 32మంది నేతలలో ఒకరుగా, సీపీఎంను స్థాపించిన ముఖ్య నేతల్లో ముందుంటారు.

Details

ప్రతిపక్ష నాయకుడిగా సేవలందించిన అనుభవం

తన రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎల్‌డిఎఫ్ కన్వీనర్, పరిపాలనా సంస్కరణల కమిషన్ ఛైర్మన్ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గత నాలుగేళ్లుగా ఆయన రాజకీయంగా క్రియాశీలంగా లేకపోయినా, ప్రజల మదిలో నిలిచిపోయారు.