
Pinnelli Ramakrishna Reddy: నెల్లూరు సెంట్రల్ జైలుకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే
ఈ వార్తాకథనం ఏంటి
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
ఈవీఎంలను ధ్వంసం చేయడం, ఓటర్లను బెదిరించడం వంటి నాలుగు కేసులకు సంబంధించి ఈ అరెస్టు జరిగింది.
రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కాగా, మరో రెండు కేసులకు సంబంధించి పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్ విధించారు.
వివరాలు
పిన్నెల్లి వేసిన పిటిషన్‌లను తిరస్కరించిన హైకోర్టు
పోలీసులు పిన్నెల్లిని నరసరావుపేట ఎస్పీ కార్యాలయం నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మాచర్లలో వైసీపీ మాజీ శాసనసభ్యుడు రాజకీయ దుమారం రేపారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి వేసిన పిటిషన్‌లను హైకోర్టు తిరస్కరించడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
పోలింగ్ రోజు,ఆ తర్వాత అతనిపై మూడు హత్యాయత్నం కేసులు సహా మొత్తం 14 కేసులు నమోదయ్యాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పిన్నెల్లి ని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Pinnelli Ramakrishna Reddy : పిన్నెల్లి ని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులుhttps://t.co/zb8dm4HKdu#TeluguISM
— TeluguISM (@telugu_ism) June 27, 2024
Pinnelli Ramakrishna Reddy : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులు పిన్నెల్లిని ...