Rajeev Chandrasekhar: రాజకీయాల నుంచి తప్పుకున్న రాజీవ్ చంద్రశేఖర్ .. శశిథరూర్ ఏమన్నారంటే..?
కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆదివారం రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ చేతిలో ఓడిపోయిన రాజీవ్ చంద్రశేఖర్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, బీజేపీ కార్యకర్తగా తన పనిని కొనసాగిస్తానని చెప్పారు. ఎంపీగా, మంత్రిగా తన కెరీర్ ఇప్పుడు ముగిసిందని, అయితే తాను బీజేపీ కార్యకర్తగా పనిచేస్తానని ట్వీట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై విజయం సాధించారు. శశి థరూర్‌కు 3,58,155 ఓట్లు వచ్చాయి. ఆయన ఓట్ల శాతం 37.19 శాతం కాగా, బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్‌కు 3,42,078 ఓట్లు వచ్చాయి. ఆయనకు 35.52 శాతం ఓట్లు వచ్చాయి.
రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ట్వీట్
రాజీవ్ చంద్రశేఖర్ ట్వీటీకి శశి థరూర్ రిప్లై ట్వీట్
మీరు ప్రభుత్వ హయాంలో మీతో పలు అంశాలపై చర్చించిన వ్యక్తిగా, ప్రజాసేవ ద్వారా మీరు మన దేశానికి మరింతగా దోహదపడగలరనడంలో సందేహం లేదని శశి థరూర్ ట్వీట్ చేశారు. ఎన్నికల కార్యాలయం ఒక మార్గం మాత్రమే (మీరు దానిని కూడా ప్రయత్నించేంత చిన్న వయస్సులో ఉన్నారు!) భవిష్యత్తుకు శుభాకాంక్షలు.