
Vijayasai Reddy: రాజ్ కసిరెడ్డే సూత్రధారి.. మద్యం కుంభకోణంలో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి ..
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సమయంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు.
ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన్ని సాక్షిగా హాజరు కావాలంటూ అధికారులు గతంలో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణ ప్రక్రియ కొనసాగుతోంది.
వివరాలు
సిట్ ముందుకి రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి
ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి అని విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు వెల్లడించారు.
ఆరుగురు సభ్యులతో కూడిన సిట్ బృందం విజయసాయిరెడ్డిని విచారిస్తోంది.
మరోవైపు రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి, ఈ రోజు ఉదయం సిట్ ముందు మరోసారి హాజరయ్యారు.
విజయసాయిరెడ్డి, ఉపేందర్ రెడ్డిలను వేర్వేరుగా విచారిస్తున్నట్లు సమాచారం.
ఒకరి సమాధానాల ఆధారంగా మరొకరిని ప్రశ్నిస్తూ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.