Page Loader
vijayasai reddy counter:"వ్యక్తిగత జీవితంలో విలువలు ఉన్నవాడిని".. వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలకు విజయ సాయి రెడ్డి కౌంటర్‌ 
వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలకు విజయ సాయి రెడ్డి కౌంటర్‌

vijayasai reddy counter:"వ్యక్తిగత జీవితంలో విలువలు ఉన్నవాడిని".. వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలకు విజయ సాయి రెడ్డి కౌంటర్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 07, 2025
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. గురువారం జరిగిన ప్రెస్‌మీట్‌లో జగన్ క్యారెక్టర్, విలువల గురించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా, విజయసాయి రెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిగా తాను ఎవరితోనూ రాజీ పడలేదని, ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మాజీ ఎంపీ ఎక్స్‌లో పోస్ట్ చేయగా, ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

వివరాలు 

విజయసాయి రెడ్డి ట్వీట్

"వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే, ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. నా లో నువ్వొక అణువంత భయమూ లేదు కాబట్టే, రాజ్యసభ పదవిని, పార్టీ బాధ్యతలతో పాటు రాజకీయాలనే వదిలేశాను" అని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విజయసాయి రెడ్డి ట్వీట్