Page Loader
కేంద్ర మాజీ మంత్రి బాబాన్‌రావ్ ధాక్నే కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి బాబాన్‌రావ్ ధాక్నే కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి బాబాన్‌రావ్ ధాక్నే కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2023
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి బాబాన్‌రావ్ ధాక్నే గురువారం రాత్రి కన్నుమూశారు. 86 ఏళ్ల ధాక్నే మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో న్యుమోనియాతో చికిత్స పొందుతున్నారు. ఆయన అంత్యక్రియలు శనివారం అహ్మద్‌నగర్ జిల్లాలోని పథర్డి తహసీల్‌లోని అయన స్వగ్రామమైన పగోరి పింపాల్‌గావ్‌లో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. చంద్రశేఖర్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ధాక్నే ఇంధన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అయన మహారాష్ట్ర ప్రభుత్వంలోను మంత్రిగా ఉన్నారు. పబ్లిక్ వర్క్స్, గ్రామీణాభివృద్ధి వంటి శాఖలను నిర్వహించారు. జనతాదళ్ మాజీ రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు, ధాక్నే రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, హౌస్ డిప్యూటీ స్పీకర్ కూడా.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేంద్ర మాజీ మంత్రి బాబాన్‌రావ్ ధాక్నే కన్నుమూత